Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు టాటా స్టీల్ ఆసక్తి

Update: 2021-08-18 01:42 GMT

టాటా స్టీల్ (ట్విట్టర్ ఫోటో)

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంటు అమ్మి తీరుతామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రకటించింది. అందుకుగానూ వేగంగా పావులు కదుపుతోంది కేంద్రం విశాఖ స్టీలు ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో టీ.వీ. నరేంద్రన్ తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ‌ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపుతోందన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉక్కు కర్మాగారం 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంది.

భారతదేశంలో సముద్ర తీరాన ఉన్న అతి పెద్ద సమగ్ర ఉక్కు కర్మాగారం విశాఖ ప్లాంట్ దక్షిణాన, తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ఈ ఉక్కు కర్మాగారానికి అనేక అదనపు విశేషణాలుణ్నాయి. విశాఖ ఉక్కు కార్మాగారానికి, దేశీయ అవసరాలను తీర్చేందుకు తగ్గట్లుగా రైలు, రహదారులు సౌకర్యాలున్నాయి. దాంతో పాటు ఇప్పటికే ఆగ్నేసియా మార్కెట్లతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న టాటా స్టీల్‌కు ఆయా మార్కెట్లకు మరింత చేరువయ్యేందుకు సముద్రతీరంలో ఉన్న విశాఖ ఉక్కు ప్రయోజకనకరంగా ఉంటుందని టీవీ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News