చంద్రబాబుకు మరో షాక్.. శ్రీనివాస్‌పై సస్పెన్షన్
Chandrababu: ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా వెళ్లిపోయిన పెండ్యాల శ్రీనివాస్
Chandrababu: చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేసింది. రూల్స్ ఉల్లంఘన ఆరోపణలతోనే శ్రీనివాస్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే కాసేపట్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పెండ్యాల శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, చంద్రబాబుకు ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్ కీలక నిందితుడిగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
అయితే శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరినట్లు ఏపీ సీఐడీ అభియోగం మోపింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికా వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. సర్వీస్ నిబంధనలు అతిక్రమించిన నేపథ‌్యంలో పరారీలో ఉన్నట్లు భావించి శ్రీనివాస్‌పై ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది.