ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. ఇవాళ ఎస్‌ఈసీ నిర్ణయం ప్రకటించే ఛాన్స్

Update: 2020-10-29 06:17 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ నిర్వహించగా.. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఎన్నికల నిర్వహణకే మెజారిటీ పార్టీలు మొగ్గు చూపాయి. ఇవాళ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసీ నిమ్మగడ్డతో సీఎస్‌ నీలం సాహ్ని భేటీ అయ్యారు.

ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు సీఎస్. వేల సంఖ్యలో ఉద్యోగులు, పోలీసులు కరోనా బారిన పడ్డారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితులు కుదుటపడగానే ఎస్‌ఈసీని సంపద్రిస్తామని కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరిస్తామని వెల్లడించారు సీఎస్. ఈ నేపథ్యంలో ఈసీ నిమ్మగడ్డ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News