ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court: 110 రీచ్‌లలో వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని ఉత్తర్వులు

Update: 2023-08-04 07:42 GMT

ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court: ఆంధ్రప్రదేశ్ లో ఇసుక రీచ్ లలో తవ్వకాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 50 అధికారిక , మరో 50 అనాధికారిక ఇసుక రీచ్ లు ఉన్నాయి. గతంలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా ఇసుక తవ్వకాలు కొనసాగుతుండటంతో నాగేంద్రకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకూ తవ్వకాలు చేపట్టకూడది ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News