తిరుపతి లడ్డూ: దేవుడ్ని రాజకీయాల్లోకి తీసుకురాకండి... సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు

Update: 2024-09-30 08:39 GMT

తిరుపతి లడ్డూ: దేవుడ్ని రాజకీయాల్లోకి తీసుకురాకండి... సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్

తిరుమల లడ్డూ అంశంలో కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా పెట్టాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిజనిజాలను తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించినట్లు వస్తోన్న ఆరోపణలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు ఉంటే ఆధారాలు సమర్పించాలంటూ స్పష్టం చేసింది. తయారైన లడ్డూలను టెస్టింగ్‌కు పంపించారా అని అడిగింది. విచారణ జరగకుండా ప్రకటన చేయడం సరికాదని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది ధర్మాసనం.

Tags:    

Similar News