Amaravati Lands: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Amaravati Lands: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Amaravati Lands: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూ కుంభకోణంపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అమరావతి భూముల కొనుగోళ్లులో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని, విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ వాదనలు ప్రారంభించారు. భూముల బదలాయింపు చట్టం ప్రకారం కొనుగోలుదారులు భూములను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో అమ్మకందారులకు చెప్పాలన్నారు. ఈ విషయంలో అమ్మకం దారులు మోసపోయారని కొనుగోలుదారులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై భూములను కొనుగోలు చేశారని దుష్యంత్ పేర్కొన్నారు.