చంద్రబాబుతో సూపర్ స్టార్ రజనీకాంత్ ములాఖత్..!

Rajinikanth: ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం.

Update: 2023-09-15 13:18 GMT

చంద్రబాబుతో సూపర్ స్టార్ రజనీకాంత్ ములాఖత్..!

Rajinikanth: ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం. టీడీపీ అధినేత చంద్రబాబుతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ములాఖత్ కానున్నారనే వార్త.. సంచలనంగా మారింది. స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును.. సోమవారం రజనీకాంత్ కలిసి పరామర్శించనున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, రజనీకాంత్ మధ‌్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో చంద్రబాబును కలబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే గతంలో చంద్రబాబు పాలనను ప్రశంసించిన రజనీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు జైల్లో ములాఖత్ కానుండడంతో మరోసారి పొలిటికల్ హీట్ రాజేసినట్టు అయింది.

Tags:    

Similar News