సూళ్ళూరుపేట పట్టణంలో రైల్వేలైను వంతెన పనులు ప్రారంభం

పట్టణంలోని తహాసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న రైల్వేలైనుకు సంబంధించిన కింద వంతెన పనులు (అండర్ బ్రిడ్జి) ప్రారంభమయ్యాయి.

Update: 2020-01-18 04:08 GMT

సూళ్లూరుపేట: పట్టణంలోని తహాసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న రైల్వేలైనుకు సంబంధించిన కింద వంతెన పనులు (అండర్ బ్రిడ్జి) ప్రారంభమయ్యాయి. గత ఏడాది కింద వంతెన పనుల నిర్మాణానికి రైల్వే శాఖ సుమారు రూ. 2 కోట్లమేర నిధులు మంజూరు చేసింది. అప్పటి నుంచి పనులకు పలు అడ్డంకులు తగలడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు రైల్వే శాఖ వంతెన నిర్మాణానికి పూనుకుంది.

రైళ్లు వచ్చే సమయంలో ఇరువైపులా వందలాది వాహనాలు బారులు తీరడంతో తీవ్ర రద్దీ నెలకొంటుంది. పట్టణ వాసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత గూడూరు శాసనసభ్యుడు వెలగపల్లి వరప్రసాద్ రావు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు తీసుకొచ్చారు. ఈ మేరకు పనులు ప్రారంభమయ్యాయి.

Tags:    

Similar News