States Startup Ranking 2019: స్టార్టప్ ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణకు చోటు..

States Startup Ranking 2019 | స్టార్టప్ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Update: 2020-09-11 14:53 GMT

States Startup Ranking 2019 | స్టార్టప్ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రంగా గుజరాత్ నిలవగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, కేరళ ఉన్నాయి. లీడర్స్ జాబితాలో బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ లకు చోటు దక్కింది. ఔత్సాహిక నాయకుల జాబితాలో పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్ కు చోటు దక్కగా.. ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలో ఏపీ తరవాత చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, తమిళనాడు, అసోం, ఢిల్లీ, మధ్యప్రదేశ్, సిక్కిం, యూపీ ఉన్నాయి. వీటి ర్యాంకులు కేంద్రమంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు.

భారత ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన రాష్ట్ర స్టార్టప్ ర్యాంకింగ్ 2019 లోని ఐదు విభాగాలలో ఆంధ్రప్రదేశ్ దిగువ విభాగంలో నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఐదవ విభాగంలో పది రాష్ట్రాలలో, అంటే ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్, ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రంగా అవతరించింది.   

Tags:    

Similar News