ఏపీలో పవన్‌ను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫైర్
Purandeswari: పవన్‌ను పోలీసులు అడ్డుకోవడం సమర్ధనీయం కాదని ట్వీట్
Purandeswari: విజయవాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. పవన్‌ను పోలీసులు అడ్డుకోవడం సమర్ధనీయం కాదని ఆమె ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ఏపీకి రావడానికి పాస్ పోర్ట్ అవసరం లేదన్నారు. పవన్ పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామని పురందేశ్వరి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.