Srisailam Dam Gates Lifted: శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత.. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు
Srisailam Dam Gates Lifted: శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
Srisailam Dam Gates Lifted: శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మరో రెండు గేట్లను ఎత్తారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు ప్రవహిస్తోంది.
శ్రీశైలం జలాశయం స్పిల్ వే ద్వారా 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4.27 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 2.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.7 అడుగులు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తు నీటి నిల్వ 202.9 టీఎంసీలుగా నమోదైంది.
శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారడంతో పాటు.. గేట్లు ఎత్తడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రాజెక్టు గేట్ల నుంచి ఉరకలెత్తుతున్న కృష్ణమ్మను చూసి పులకరించిపోతున్నారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.