Bhadrachalam: భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తులకు ఫొటోలు తీస్తూ జీవిస్తున్న శ్రీదేవి
Bhadrachalam: ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న శ్రీదేవి
Bhadrachalam: భద్రాచలం పట్టణం జగదీష్ కాలనీకి చెందిన శ్రీదేవి అనే మహిళ 20 సంవత్సరాలుగా ఫొటోగ్రఫీని నమ్ముకొని జీవనంసాగిస్తోంది. భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులకు పోటోలు తీస్తూ జీవనం సాగిస్తోంది. ఇవాళ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హెచ్‌ఎంటీవీ ఆమెను పలుకరించింది. భర్త ఆరోగ్యం క్షీణించి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఫొటోలు తీస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిస్తోంది. ఫోటో గ్రఫీనే నమ్ముకుని జీవిస్తున్ననని శ్రీదేవి చెబుతోంది. మరో పనిచేయలేనని, దళిత బంధు పథకం ద్వారా తమను ఆదుకోవాలని కోరుతోంది.