Special Officers Governance Extended: ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Special Officers Governance Extended: ఏపీలో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తెసుకుంది.
Special Officers Governance Extended: ఏపీలో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తెసుకుంది. ప్రస్తుడం రాష్ట్రంలో ప్రకాశం, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పురపాలక సంఘాల్లో 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా వైరస్, లాక్ డౌన్ రణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో ఈ నొటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలకశాఖ తమ ఉత్వర్వుల్లో పేర్కొంది.
అయితే, ఈ ఏడాది మార్చ్10న కార్పొరేషన్‌లో, జూన్ 30న మున్సిపాలిటీలలో, జూలై 2తో నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల యొక్క పాలనా ముగిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంది.. రోజు రోజుకు పాజిటివ్ కాసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటి, పురపాలక సంఘాల్లో వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ఉత్తర్వులు జరీ చేయటంతో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవనే తెలుస్తుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,686 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 10,328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,96,789 కి చేరింది. గడచిన 24 గంటల్లో 72మంది చనిపోయారు. దీంతోమొత్తం మరణాల సంఖ్య 1753కి చేరింది. గత 24 గంటల్లో 8,514 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,12,870కు చేరింది. మరో 82,166 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1351, కర్నూలు జిల్లాలో 1285, అనంతపురం జిల్లాలో 1112, విశాఖపట్నం జిల్లాలో 781, పశ్చిమగోదావరి జిల్లాలో 798, గుంటూరు జిల్లా 868, కడప జిల్లాలో 604, నెల్లూరు జిల్లాలో 788, శ్రీకాకుళం జిల్లాలో 682, చిత్తూరు జిల్లాలో 755, ప్రకాశం జిల్లాలో 366, కృష్ణా జిల్లాలో 363, విజయనగరం జిల్లా 575 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 27,580 పాజిటివ్ కేసులు.. తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 23,348కు చేరాయి. అనంతపురం జిల్లాలో 21,173 కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 22,99,332 సంప్లిల్స్ ను పరిక్షించడం జరిగింది.