Weather: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు

Weather: ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు * మాన్‌సూన్ ప్రభావంతో రాయలసీమలో వర్షాలు

Update: 2021-06-04 12:42 GMT

ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించిన రుతుపవనాలు (ఫైల్ ఇమేజ్)

Weather: ఒకవైపు ఉపరితల ద్రోణి మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఇఫ్పటికే ఏపీలోకి ప్రవేశించినట్లు ఐఎండీ ప్రకటించింది. మాన్‌సూన్ ప్రభావంతోనే రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. నైరుతి గాలుల కారణంగా ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌, నల్గొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట తదితర జిల్లాల్లో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. యాదగిరిగుట్టలో కురిసిన భారీ వర్షానికి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోకి నీరు చేరింది. వాన నీటితో యాదాద్రి బాలాలయం చెరువును తలపిస్తోంది. అర్చకులు వర్షపు నీటిలో కూర్చుని పూజలు నిర్వహించారు. ఇక, సూర్యాపేట జిల్లాలో ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి శేషలేటివాగు పొంగిపొర్లుతోంది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతోపాటు రాయలసీమలో పలుచోట్ల వానలు పడుతున్నాయి. కడప జిల్లాలో జమ్మలమడుగు, రాజంపేట, మైలవరం, వేంపల్లె, పెద్దముడియం, ఎర్రగుంట్ల, బ్రహ్మంగారిమఠం, వీరపునాయునిపల్లె, చక్రాయపేట మండలాల్లో వర్షం దంచికొట్టింది. దాంతో, పాపాగ్ని నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ఇక, తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నారు. కోనసీమలో గాలివానకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి

Tags:    

Similar News