విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై దర్యాప్తుకు దక్షిణ కొరియా బృందం

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ను స్టైరిన్‌ గ్యాస్‌‌ లీకేజీ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2020-05-13 07:36 GMT
Visakha Gas Leak
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ను స్టైరిన్‌ గ్యాస్‌‌ లీకేజీ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 12మంది చనిపోగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ప్రభుత్వం

విచారణ చేపట్టింది. మంగళవారం రాత్రి నుంచి ట్యాంకర్ల ద్వారా స్టైరిన్‌ను షిప్ యార్డ్‌కు తరలిస్తున్నారు. కాగా.. దక్షిణ కొరియా నుంచి 8 మందితో కూడిన ప్రత్యేక బృందం భారత్‌కు బయలుదేరినట్లు ఎల్‌జీకెమికల్స్‌ ప్రధాన కార్యాలయం తెలిపింది.

స్టైరీన్‌ లీకేజీకి గల కారణాలను విశ్లేషించడంతో పాటు గ్యాస్‌ లీక్‌ కారణంగా... ప్రభావితమైన స్థానిక ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం వివరించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా ఈ బృందం సమావేశం కానుంది. ఇక కంపెనీలో మొత్తం 13,048 టన్నుల స్టెరైన్‌ను అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి నుంచి ట్యాంకర్ల ద్వారా స్టైరిన్‌ను షిప్ యార్డ్‌కు తరలిస్తున్నారు. మిగిలినస్టెరైన్‌ని వెజల్ నార్డ్ మేజిక్ ద్వారా మే 17 లోపు దక్షిణకొరియా తరలించే ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News