Sonu Sood Helps AP Tribes: సోనూ.. ఈ సారి భారీ సాయం
Sonu Sood Helps AP Tribes: వారంతా గిరిజనులు, ఆధునిక సమాజానికి దూరంగా, అడవికి దగ్గరగా ఉంటారు.
Sonu Sood Helps AP Tribes: వారంతా గిరిజనులు, ఆధునిక సమాజానికి దూరంగా, అడవికి దగ్గరగా ఉంటారు. వాళ్ళు పట్టణాలకు వెళ్ళాలంటే మైళ్ళ దూరం నడిచి వెళ్ళాల్సిందే. రోగం వచ్చినా, నొప్పులు వచ్చినా కిలోమీటర్ల దూరం రోడ్డ్ మార్గమే దిక్కు. ఎందుకంటే ఆ గ్రామానికి రోడ్ లేదు. తమకు రోడ్ సౌకర్యం కల్పించమని స్థానిక నాయకుల చుట్టూ తిరిగారు. జిల్లా అధికారులకు తమకు రోడ్డు మార్గం, రోడ్ లేక అల్లడుతున్నామని ఆవేదం వ్యక్తం చేసారు. కనీ, ఎవరూ అడవి బిడ్డల బాధలు పట్టించ్చుకోలేదు. ఎన్నికలప్పుడు తప్ప వారిని పట్టించుకొనే నాదుడే లేడు. ఆ ఊరి ప్రజలకు అనారోగ్యం వచ్చినా.. మరే ఉపద్రవం వచ్చినా కొండల వెంబడి నడిచి రావడం తప్ప మరో మార్గం లేదు. ఆపత్కర సమయాల్లో రోగులను గర్భిణీలను డోలీ కట్టి ఐదు మైళ్ళు నడిచి రావటం వాళ్ళకు ఉన్న ఒకే ఒక దారి. వాటి బాధలు పడలేక గ్రామస్తులంతా చందాలు వేసుకుని రోడ్డు ను నిర్మించుకున్నారు.
విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఉన్న చింతామణ, బలీ, సిరివాడ గ్రామాలకు దగ్గరలో ఉన్న గ్రామాలకు చేరాలంటే మైళ్ళ కొద్ది నడవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో 250 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తమ గోడు పట్టించుకొనే అడవి బిడ్డలకు ప్రభుత్వంపై విసుగొచ్చింది. దీంతో తామే చందాలు వేసుకుని రోడ్డ్ ను నిర్మించుకున్నారు. అయితే, ఆ గిరిజన గ్రామస్తులు వేసుకున్న రోడ్డు ను ప్రశంసిస్తూ.. సినీ నటుడు సోనూ సూద్ తన ట్వీట్ తో స్పందించారు. ఒక్క ట్వీట్ తో విజయనగరం రాజకీయాల్లో సంచలనం రేకెత్తించారు.
గత ప్రభుత్వం రహదారి ఏర్పాటుకు నిధులు కేటాయించినా అధికారులు నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ ల అలసత్వం తో ఆ పనుకు కొంతవరకే సాగి మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో నైనా తమ బాధ తీరుతుందనుకున్నారు. కనీ, జిల్లలో గిరిజన శాఖా మంత్రి ఉన్నా తమ బాధను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం రహదారి కోసం కేటాయించిన నిధులను ఆపివేశారు. దీంతో తమ పని మళ్లి మొదటికే వచ్చింది. వీరికి తోడుగా చుట్టుపక్కల 10 గ్రామాలు సయం చేయడానికి ముందుకు వచ్చాయి. అందరు చందాలు వేసుకునే సుమారు 5 లక్షల వరకు కూడబెట్టారు. అయితే, ఆ వచ్చిన డబ్బుతో వారు రహదారిని నిర్మించుకున్నారు.