Social Media: కష్టకాలంలో అందిన సహాయం కష్టంగా మారిపోయింది!

Update: 2020-07-29 11:16 GMT

Social Media: పుకార్లు పుట్టగొడుగుల్లా పుడుతాయి. సంచనాలు సవాలక్ష జరుగుతాయి. పరువు తీస్తుంది. లేదంటే హైలెట్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన ఆయుధం సోషల్ మీడియా ఆ సోషల్ మీడియానే ఇప్పుడు ఓ కుంటుంబాన్ని ఆదుకునేలా చేసింది. ఎక్కడో మారుమూల పల్లెటూళ్లో ఉన్న కుటుంబానికి ఆసరాగా నిలిచింది. కానీ మారునాడే మళ్లీ నువ్వు పేదవాడివి కాదంటూ నిందిస్తుంది. ఆ సాయం వృధా అంటూ ఎత్తిపొడుస్తుంది. మరీ ఏది నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.

చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మహల్ రాజపురానికి చెందిన ఓ రైతు తన ఇద్దరు కుమార్తెలను కాడెద్దులుగా చేసి నాగలితో దుక్కిదున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలై సోనూ సూద్ మనసుని కదిలించింది. మాట ఇచ్చిన గంటల్లోనే ఆ రైతు ఇంటికి ట్రాక్టర్ ను పంపించి, తాను మనసున్న మహారాజు అనిపించుకున్నాడు సోనూ సూద్. సోనూ సూద్ సాయం అందుకోవడంతో ఈ రైతు జీవితంపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చజరుగుతోంది. అసలు నాగేశ్వర్రావు కుటుంబం కడు బీదరికంలో లేదని, ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన సంక్షేమ పథకాలన్ని అందాయని ప్రచారం జరుగుతోంది. కానీ నాగేశ్వరరావు జీవితంలోకి తొంగిచూస్తే అవన్నీ పుకార్లని ఇట్టే అర్థమవుతుంది.

పశువులు చేసే పనిని కష్టంగా చేసిన ఇద్దరమ్మాయిలు ఫోటోల కోసం చేసినా సరదా సన్నివేశాలంటూ మరో కొత్తకోణాన్ని వైరల్ చేస్తున్నారు కొందరు గిట్టని వాళ్లు ఆ పుకార్లు విని నాగేశ్వరరావు పిల్లలు కన్నీంటి పర్యాంతమవుతున్నారు. మా కష్టాన్ని చూసి చలించి సాయం చేసిన సోనుసూద్ కు నాగేశ్వరరావు కూతుళ్లు మనస్ఫూర్తిగా కృతజ్నతలు తెలుపుతున్నారు. ఓ అన్నయ్యలా ఆదుకుంటున్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో తెలియని వ్యక్తి తమకు సాయం చేస్తే ఓర్వలేకనే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు నాగేశ్వరరావు కుటుంబసభ్యులు పస్తులన్న రోజులు గడిపామని నాగేశ్వరరావు భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు.

డిగ్రీ వరకు చదువుకున్న నాగేశ్వరరావు చైతన్యవంతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. 2009లో లోక్ సత్తా పార్టీ కి పనిచేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం పౌరుహక్కుల సంఘాల్లో పని చేశారు. అందుకే చాలా మంది నాగేశ్వరరావుకు రాజకీయ నేపథ్యం ఉందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు సైతం నాగేశ్వరరావు కుటుంబానికి అండగా నిలబడ్డాడు. తన పిల్లల చదువుల ఖర్చును భరిస్తా అంటూ ప్రకటించారు. దీంతో ఈ కుటుంబంపై రాజకీయ బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోనుసూద్ సాయంతో కష్టాల గట్టేక్కాయనే సంతోషాన్ని నాగేశ్వరరావు కుటుంబానికి లేకుండా చేస్తున్నాయి కొందరు సృష్టిస్తున్న పుకార్లు ఏదీ ఏమైనా నిజ నిజాలు తెలియకుండా మనసులను బాధపెట్టేలా పోస్టులు పెట్టడం సరికాదు.


Tags:    

Similar News