కోనసీమలో ప్రకృతి అందాలకు తోడైన మంచు!
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కోనసీమ. అటువంటి అందాలకు మంచు తోడైతే ప్రకృతి రమణీయత చూపరులను కట్టిపడేస్తుంది. శరత్ ఋతువులో కోనసీమ ప్రాంతంలో తెల్లవారుజామున రెండు రోజులుగా మంచు కురుస్తోంది.
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కోనసీమ. అటువంటి అందాలకు మంచు తోడైతే ప్రకృతి రమణీయత చూపరులను కట్టిపడేస్తుంది. శరత్ ఋతువులో కోనసీమ ప్రాంతంలో తెల్లవారుజామున రెండు రోజులుగా మంచు కురుస్తోంది. పచ్చని కొబ్బరి చెట్ల నడుమ, గోదావరి నదీ పాయలపై, అందమైన పూలపై కురుస్తున్న మంచుతో కోనసీమ ప్రకృతి అందాలకు కొత్త అందాలు తోడయ్యాయి. దసరా పండగకు సొంతూరికి వెళ్లిన కోనసీమ వాసులకు మంచు మంచి స్వాగతం పలికింది. పండగ వేళ మంచు తెరల చాటు అందాలను చూసి ప్రజలు మంత్రముగ్దులవుతున్నారు.