Chittoor: గర్భిణీలకు పంపిణీ చేసే పౌష్టికాహారంలో పాము కళేబరం
Chittoor: ఖర్జూరం ప్యాకెట్‌లో పాము కళేబరంపై సూపర్‌వైజర్‌కు ఫిర్యాదు
Chittoor: ఏపీలో గర్భిణులకు పంపిణీ చేసే పౌష్టికాహారంలోని ఎండు ఖర్జూరం ప్యాకెట్ లో పాము కళేబరం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్ లోని అంగన్ వాడీ కేంద్ర పరిధిలో గర్భిణులకు ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టికాహారంలో ఎండు ఖర్జురాలు ఉన్నాయి. అయితే ప్యాకెట్ తీసుకున్న ఆ మహిళ ఇంటికి వెళ్లి తెరిచి చూసింది.. అందులో పాము కళేబరాన్ని చూసి షాక్ కు గురైంది. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఘటనపై స్పందించిన సీడీపీవో వాణిశ్రీదేవి పాము కళేబరం విషయం వాస్తవమేనని నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నాధికారులకు తెలియజేశామని తెలిపారు.