Tirupati Laddu Row: కల్తీ నెయ్యి ఘటనపై నేటి నుంచి సిట్‌ విచారణ ప్రారంభం

Tirumala: తిరుపతి శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి ఘటన.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Update: 2024-09-28 06:21 GMT

Tirupati Laddu Row: కల్తీ నెయ్యి ఘటనపై నేటి నుంచి సిట్‌ విచారణ ప్రారంభం

Tirumala: తిరుపతి శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి ఘటన.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. లడ్డూ వివాదంపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనుంది. తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కల్తీనెయ్యి ఘటనపై నమోదైన కేసు వివరాలను సేకరించి విచారణ ప్రారంభించనుంది.

లడ్డూ తయారీ, ముడిసరుకుల కేంద్రం, దిగువన ఉన్న టెస్టింగ్ ల్యాబ్ లను పరిశీలించి.. లడ్డూ తయారీదారులతో భేటీ కానుంది సిట్‌ టీమ్. ఈ సిట్ టీమ్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు ఈ బృందంలో సభ్యులుగా పని చేయనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక అందించనున్నారు. ఈ విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు, సభ్యులను సైతం విచారించనున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News