PDS Rice Sumggling: రేషన్ బియ్యం అక్రమ రవాణా పై సిట్ ఏర్పాటు
PDS Rice Sumggling: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.
PDS Rice Sumggling: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ వినీత్ బ్రిజ్ లాల్ చీఫ్ గా ఆరుగురు సభ్యులతో సెట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమా మహేశ్వర్, డీఎస్పీలు ఆశోక్ వర్ధన్, గోవిందరావు, బాలసందర్ రావు, రత్తయ్యను నియమించారు. ప్రతి 15 రోజులకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్ కు పూర్తిస్థాయి అధికారాలను ప్రభుత్వం కల్పించింది. బియ్యం రవాణా కేసులను సిట్ విచారించనుంది.
కాకినాడ పోర్టులో 1,064 టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది.ఈ బియ్యం తరలిస్తున్న నౌకను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ నౌకను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై 13 కేసులు నమోదయ్యాయి. బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు సంస్థలన్నీ కూడా సిట్ కు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా మారిందని జనసేన, టీడీపీ గతంలో ఆరోపణలు చేశాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి. ఈ క్రమంలోనే పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమంగా తరలింపుపై కన్నేశారు. కాకినాడలో పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. కాకినాడ పోర్టుకు తనను రెండు నెలలుగా రాకుండా అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చర్చకు దారి తీశాయి.