Y S Sharmila: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల విమర్శలు
Y S Sharmila: ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు అని షర్మిల ప్రశ్న
Y S Sharmila: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై.. పీపీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని షర్మిల ఎద్దేవా చేశారు. NDA కూటమిలో చక్రం తిప్పాల్సిన మీరు.. ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారని ఎక్స్‌లో పోస్టు చేశారు షర్మిల. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారని నిలదీశారు.
గెలిచిన నాటి నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా ? అని ప్రశ్నలను లేవనెత్తారు ఆమె. రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుందని చంద్రబాబు గుర్తిస్తే మంచిదని హితవు పలికారు షర్మిల.