Andhra Pradesh News: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం.
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదనరెడ్డిలను నియమించింది. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, ఆర్‌అండ్‌బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్లను బదిలీ చేసింది. ప్రస్తుతం సీఎంవో స్పెషల్ సీఎస్‌గా బాధ్యతలు చేపడుతున్న కెఎస్ జవహర్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.