Palnadu: నరసరావుపేటలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. 144 సెక్షన్ విధించిన పోలీసులు

Palnadu: ఐపీ పెట్టిన వ్యాపారి ఇల్లు విషయంలో చెలరేగిన వివాదం

Update: 2023-07-18 11:40 GMT

Palnadu: నరసరావుపేటలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. 144 సెక్షన్ విధించిన పోలీసులు

Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఐపీ పెట్టిన వ్యాపారి ఇల్లు వివాదం టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. కార్యకర్తలు మధ్య రగిలిన వివాదం నేతలు జోక్యం చేసుకునే స్థాయికి చేరుకుంది. పరిస్థితి చేయిదాటిపోయి చివరకు ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే స్థాయికి వెళ్లింది. దీంతో నరసరావు పేటలో పోలీసులు 144సెక్షన్ విధించారు. అంతేకాదు 19మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News