ఏపీ పంచాయతీ ఎన్నికలు.. రెండో విడత 70 గ్రామాలు ఏకగ్రీవం.. ఆ జిల్లాలో అత్యధికం
*గుంటూరు జిల్లాలో అత్యధిక ఏకగ్రీవాలు *67 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీ మద్దతుదారుల విజయం *రెండో విడతలో 211 గ్రామాల్లో ఎన్నికలు
గుంటూరు జిల్లాలో రెండో విడత ఎన్నికల్లోను ఏకగ్రీవాల హావా కొనసాగుతుంది. మొదటి విడతలో 67 పంచాయతీలు ఏకగ్రీవం కాగా....రెండో విడత జరిగే నరసరావు పేట రెవెన్యూ డివిజన్ లో ఆ ప్రభావం కనిపిస్తుంది. 70 చోట్ల ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు.
అత్యధిక ఏకగ్రీవాల జిల్లాల్లో ముందున్న గుంటూరు జిల్లాలో... రెండో విడతలోను ఆ జోరు కనిపించింది. రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 70 గ్రామాలు ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. ఇందులో 67 చోట్ల వైసిపి విజయం సాదించగా.. రెండు చోట్ల టిడిపి మద్దతు దారులు గెలిచారు.
రెండో విడతలో భాగంగా నర్సారావు పేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెన పల్లి నియోజవకర్గాల్లోని 211 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 70 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో నర్సారావు పేట నియోజకవర్గంలో మొత్తం 49 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.... 27 ఏకగ్రీవం అయ్యాయి. ఈ 27 పంచాతీయలు వైసిపి మద్దతు దారులు గెలుచుకున్నారు. ఇక చిలకలూరి పేటలో 51 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.... 12 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకిరకల్లు మండలంలో 17 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.... 7 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. వినుకొండ నియోజకవర్గం పరిధిలోని 94 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 24 గ్రామాలు వైసిపికి ఏకగ్రీవం అయ్యయి.
జిల్లాలో తొలి విడతలో 67 ఏకగ్రీవం కాగా... రెండో విడతలో 70 ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడత ఏకగ్రీవాలు కూడా కలుపుకుంటే 321 చోట్ల వైసీపీ మద్దతు దారులు గెలిచారు. రెండో విడత ఎన్నికలు 13 తేదీనజరగనున్నాయి.