Andhra Pradesh: ఏపీలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన
Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏడుగురు సభ్యులు
Andhra Pradesh: వర్షం మాట వింటేనే చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజలు హడలిపోతున్నారు. తిరుపతి, నెల్లూరులో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జనాలు ఆందోళన పడుతున్నారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది. నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఈనెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రాలో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరద నష్టాలను సభ్యులు పరిశీలిస్తున్నారు. ఇవాళ రెండోరోజు చిత్తూరు జిల్లాలోని మిగితా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇంకో బృందం కడప జిల్లాలో పర్యటించనుంది. రేపు నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. ఈనెల 29న సీఎం జగన్‌తో సమావేశం అవుతారు.