పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దుపై అప్పీల్‌కు వెళ్లిన ఎస్‌ఈసీ.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ..
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దుపై ఎస్‌ఈసీ అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లింది. అత్యవసర పిటిషన్‌గా భావించి విచారించాలని ఎస్‌ఈసీ తరఫు లాయర్ కోరారు. సింగిల్ బెంచ్ తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తెలిపారు. దీనిపై రేపు విచారించే అవకాశం ఉంది.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పంచాయతీ ఎన్నికలపై ఈసీ నోటిఫికేషన్ ను కోర్టు కొట్టివేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ ఎన్నికల ప్రక్రియకు అడ్డువస్తుందంటూ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల నిర్వహణపై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు నిర్ణయంతో యధావిధిగా ఇళ్ల పట్టాలు, అమ్మఒడి పథకాలు కొనసాగించనున్నది రాష్ర ప్రభుత్వం.