Pedda Reddy: చంద్రబాబు రాజకీయ జీవితంలో కుంభకోణాలు కొత్త కాదు
Pedda Reddy: ఓటుకు నోటు కేసులలో వ్యవస్థను మేనేజ్ చేసి బయటకు వచ్చారు
Pedda Reddy: ఆలీబాబా 40 దొంగల అధ్యక్షులు చంద్రబాబు అని ఆయనతో పాటు స్కాంలకు పాల్పడిన అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, జేసీ ప్రభాకర్ రెడ్డిలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. చంద్రబాబు రాజకీయ జీవితంలో కుంభకోణాలు కొత్త కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు నోటు కేసులలో వ్యవస్థను మేనేజ్ చేసి బయటకు వచ్చారని ఆరోపించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 26 కేసులపై స్టే తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రులు ఎవరు జైల్ కు వెళ్లలేదన్నారు. చంద్రబాబు యువత ఉపాధి కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కాం చేశారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుతో న్యాయం గెలిచిందని, చట్టం తన పని తాను చేసుకుపోయిందన్నారు. చంద్రబాబు అరెస్టు కావడంతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించదన్నారు.