Sand Vendors Facing Problems: ఇసుకను నమ్ముకున్నవారి బ్రతుకు మట్టిపాలు !

Update: 2020-07-08 07:21 GMT

Sand Vendors Facing Problems : శాఖల మధ్య సమన్వయ లోపమో, లేక అధికారులకు వారి మీద ఉన్న కోపమో తెలియదు కానీ వారు కనిపిస్తే చాలు లాఠీలు పట్టుకొని వెంటపడుతున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయంతో వారి కటుంబాలు రోడ్డున పడ్డాయి. పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఆందోళన బాట పట్టారు.

కర్నూలు జిల్లాకు తుంగభద్ర, హంద్రీ నదులు జల వరప్రదాయినులు. వర్షాకాలంలో ఈ రెండు నదులు వరదలతో రైతన్నలకు సాగునీటిని అందిస్తే మిగిలిన సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందిస్తాయి. కొందరు ఈ నదిలో దొరికే ఇసుకను అక్రమ రవాణా చేసి కోట్లు సంపాధించుకుంటున్నారు. మరికొందరు ఇదే నదుల్లో దొరికే ఇసుకను నమ్ముకొని కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నదుల్లో ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. దీంతో నదుల్లోకి వెళ్లలేక ఇసుక అమ్మకం దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఇసుకను నమ్ముకొని పదుల సంఖ్య లో చిన్నపాటి కుటుంబాలు కడుపు నింపుకుంటున్నాయి. వీటి పై అధికారుల ఆంక్షలు ఎక్కువవడంతో వాటిని నియంత్రించాలని కార్మిక సంఘాలతో కలిపి పోరు బాట పట్టారు. తాము దశాబ్దాల నుండి నదుల నమ్ముకొని తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని చెబుతున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రూపాయలకు ఇసుక లభించే నాటి నుంచి ఇసుక అమ్ముకుంటున్నామని ఇసుక అమ్మకం దారులు చెబుతున్నారు. ఇసుకపై అంక్షలు విధించేస్తే ఎం చేసుకొని బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పాలసితో ఇసుక దొరక్క అల్లాడిపోతున్న ప్రజలకు ఎద్దుల బండ్లపై దొరికే ఇసుక కాస్త ఊరటనిస్తోంది. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం అంక్షలు విధించడంతో అటు ప్రజలు, ఇటు ఇసుక అమ్ముకొని బతికే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Tags:    

Similar News