ఇసుక పాలసీ లో సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Update: 2020-06-10 04:17 GMT

ఇసుక పాలసీ లో సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్‌ చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఇసుక రీచ్లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలకు ప్రత్యేక వెసులుబాటు. సొంత అవసరాలకోసం ఎడ్లబండిపై ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి.

ఒకవేళ ఇసుకను అక్రమంగా అమ్ముకోవడం,నిలువ చేసుకోవడం లాంటివి చేస్తే పెనాల్టీ. మొదటిసారి పట్టుబడితే 2000, రెండోసారి పట్టుబడితే 3000, అంతకంటే ఎక్కువ సార్లు పట్టుబడితే 5000 వరకు జరిమానా. జరిమానా తో పాటు ఇసుకను సైతం సీజ్ చేయనున్న అధికారులు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన వివిధ పథకాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Tags:    

Similar News