Sajjala: టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ.. లక్ష గ్లోబల్స్ కలిస్తే ఒక్క చంద్రబాబు..
Sajjala Ramakrishna Reddy: టీడీపీపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sajjala Ramakrishna Reddy: టీడీపీపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ అని ఆయన విమర్శించారు. లక్ష గ్లోబల్స్ కలిస్తే ఒక్క చంద్రబాబు అని ఆయన అన్నారు. దొంగతనం చేసి అరెస్ట్ అయితే అక్రమ అరెస్ట్ అని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ దేశానికి ఏదో జరిగిపోతుందని టీడీపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని సజ్జల అన్నారు. స్కిల్ స్కామ్‌పై మూడేళ్ల పాటు విచారణ చేశాకే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. స్కిల్ కేసును పక్కకి నెట్టేందుకే టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.