Andhra Pradesh: చంద్రబాబు విషప్రచారం మానుకో..నీవల్లే ఢిల్లీ పక్కన పెట్టింది-సజ్జల
Andhra Pradesh: చంద్రబాబు కొత్త వేరియంట్ అంటూ ప్రచారం చేసి ప్రజలను భయబ్రంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
Andhra Pradesh: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు కొత్త వేరియంట్ అంటూ ప్రచారం చేసి ప్రజలను భయబ్రంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నిర్వాకం ఏపీ స్ట్రెయిన్ అని పేరు కూడా పెట్టారని చెప్పారు. చంద్రబాబు కోవిడ్ పై చేస్తున్న విషప్రచారం ప్రభావం ప్రజలపై పడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న సమాజం ఈ విష ప్రచారం వల్ల తీవ్రంగా నష్టపోతోందని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న ప్రచారం ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడిందని అన్నారు.
ఢిల్లీ, ఒరిస్సా రాష్ట్రాలు మన రాష్ట్రం నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించాయని, చంద్రబాబు తప్పుడు ప్రచారం వల్లే ఇదంతా జరిగిందని దుయ్యబట్టారు. కర్నూల్ లో N440K కనిపించిందని చంద్రబాబు చెప్తున్నారని, తనకు అవగాహన లేని విషయంపై దూకుడుగా విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబుకు ఏం తెలుసని మాట్లాడుతున్నారని.. శాస్త్రవేత్తలు చూసుకుంటారు అని చెప్పినా పేద చెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నీచ రాజకీయాలకు, నిందలకు ఇది సమయం కాదని సజ్జల హితవు పలికారు. చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల పరాయి రాష్ట్రాల వారికి చూలకన అవుతున్నామని, ఇప్పుడు ఢిల్లీ ఫలితంగా మన వాళ్ళని 14 రోజులు పరిశీలనలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఢిల్లీలోనే అధికంగా కేసులు ఉన్నాయి. వస్తే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అన్నారు. రాజకీయ పార్టీలుగా సీపీఐ లాంటి వాళ్ళు కోవిడ్ సెంటర్లు నడుపుతున్నారు మంచి పరిణామం అన్నారు. ప్రతిపక్షంగా ఎదో ఒక సాయం చేయాలిగానీ బురదజల్లుతున్నావని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలి , పరిపక్వత ఉన్న మనుషులైతే వివేకంతో మాట్లాడతారు. ఈ రాష్ట్రమైతే నీ అదృష్టం కొద్దీ నిన్ను మోసిందో ఆ రాష్ట్రానికే ఎసరు పెట్టావు నీది మిడి మిడి జ్ఞానం కూడా కాదు అజ్ఞానమే మనిషి.రూపంలో ఉన్న దయ్యంలా తయారయ్యావు జగన్ పై నిందలు మోపడమే పనిగా చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. జగన్ నీ కుయుక్తులు ఎదుర్కొంటారు..కానీ మధ్యలో ప్రజలు ఉన్నారని గుర్తుంచుకో
ఏపీ వారిని అంటరానివారిగా దేశం ముందు ఉంచావు మరింత భయాందోళనలు, అభద్రతా భావం సృష్టిస్తున్నావ్ ..నీకు ఏ శిక్ష వేయాలి..ఇప్పటికే కర్నూల్ జిల్లా బార్ అసోసియేషన్ కేసు పెట్టింది..చంద్రబాబు చేసింది దేశ ద్రోహంగా భావించాల్సి వస్తుంది చంద్రబాబు తీరుపై పౌర సమాజం స్పందించాలి...ఎందుకిలా భయాందోళనలకు గురిచేస్తున్నావు అని నిలదీయాలి అని సజ్జల అన్నారు.