Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సజ్జల
Andhra Pradesh: మొత్తం 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం సీట్లు
Andhra Pradesh: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు ఆయన. మరో 7 స్థానాలు ఓసీలకు కేటాయించామన్నారు.
విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు, విశాఖ నుంచి వరుదు కల్యాణి, వంశీకృష్ణ యాదవ్ తూర్పుగోదావరి నుంచి అనంత ఉదయ్ భాస్కర్, కృష్ణా నుంచి అరుణ్ కుమార్, తలశిల రఘురాం గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హన్మంతరావు ప్రకాశం నుంచి మాధవరావు, చిత్తూరు నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, అనంతపురం నుంచి వై.శివరామిరెడ్డిని ఎంపిక చేశారు.
* ఇందుకూరు రఘురాజు -విజయనగరం(క్షత్రియ)
* వరుదు కల్యాణి -విశాఖ(బీసీ వెలమ)
* వంశీకృష్ణయాదవ్ -విశాఖ(బీసీ)
* అనంత ఉదయ్‌భాస్కర్ -తూర్పుగోదావరి(కాపు)
* మొండితోక అరుణ్‌కుమార్ -కృష్ణా(ఎస్సీ)
* తలశిల రఘురాం -కృష్ణా(కమ్మ)
* ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -గుంటూరు(కాపు)
* మూరుగుడు హన్మంతరావు -గుంటూరు(బీసీ)
* తూమాటి మాధవరావు -ప్రకాశం(కమ్మ)
* కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ -చిత్తూరు(వన్యకుల క్షత్రియ)
* వై.శివరామిరెడ్డి -అనంతపురం(రెడ్డి)