Sajjala: చంద్రబాబు తీరుపై మండిపడ్డ సజ్జల.. సీఎం జగన్ కూడా నిబంధనలు పాటిస్తున్నారు
Sajjala: తొక్కిసలాటలు జరగకపోతే జీవో నెం.1 తెచ్చేవాళ్లంకాదు
Sajjala: టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కూడా జీవో నెంబర్ 1 నిబంధనలకు అనుగుణంగానే రాష్ట్రంలో పర్యటిస్తు్న్నారని స్పష్టం చేశారు. కందుకూరు, గుంటూరులో తొక్కిసలాట ఘటనలు జరగకపోతే జీవో తేవాలనే ఆలోచనే చేసే వాళ్లం కాదన్నారు సజ్జల. చైతన్య రథం కోసం బాబు ధర్నాకు దిగాడని వాహనాన్ని ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం పోలీసులకు ఏముందని ప్రశ్నించారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు మైక్ పర్మిషన్ తీసుకోలేదని అందుకే వాహనం సీజ్ చేశారని సజ్జల వివరించారు.