కోరుకున్న వాడు దొరికినందుకు ఆనంద పడింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అత్తింటికి వెళ్లింది. అంతే, వివాహమైన నాలుగు నెలలకే భర్త రేవంత్ నిజస్వరూపం బయటపడింది. భర్త టార్చర్ భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఉన్మాదం తలకెక్కిన రేవంత్ భార్యపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాల్ గార్ల్‌గా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టాడు. తిరుపతి తిమ్మానాయుని పాళెంకు చెందిన భర్త రేవంత్ సైకోలాగా మారిపోవడంతో బాధితురాలు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు బాధితురాలి బంధువులు ఆందోళ చేస్తున్నారు. దీంతో రేవంత్ ఇంటి ముందు ఉద్రిక్తతంగా మారింది.
తిరుపతి నగరంలో పెళ్లైన నాలుగు నెలలకే నరకం చూపించాడు ఓ కసాయి భర్త. ఉన్నత చదువు, ఉద్యోగం కన్నా అతని పైశాచిక ప్రవర్తనతో విసిగించాడు. చివకు కట్టుకున్నోడే ఆమెను కాల్ గర్ల్ గా మార్చి వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. ఆ నవ వదువు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆయినా పోలీసులు సరిగా స్పందించలేదని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. బాధితురాలికి మహిళా సంఘాలు బాసటగా నిలిచాయి.