ఏపీ ఇంటర్ విద్యామండలిలో నిధుల గోల్‌మాల్.. రూ. 50 లక్షలు...

Board of Intermediate Education: పారితోషికాలు రావడంతో కొన్ని నెలలుగా బోర్డుకు లెక్చరర్లు, సిబ్బంది ఫిర్యాదు...

Update: 2022-03-19 06:31 GMT

ఏపీ ఇంటర్ విద్యామండలిలో నిధుల గోల్‌మాల్.. రూ. 50 లక్షలు...

Board of Intermediate Education: ఏపీ ఇంటర్ విద్యామండలిలో నిధుల గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తోంది. 50 లక్షల రూపాయల నిధులు గోల్‌మాల్‌ జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. సిబ్బందికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఓ ఉద్యోగి తన ప్రైవేట్‌ ఖాతాకు మళ్లించినట్లు తెలుస్తోంది. ఇక ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.

అయితే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఉద్యోగిపై కేసు నమోదు చేసేందుకు బోర్డు సిద్ధమవుతోంది. పారితోషికాలు రావడంతో కొన్ని నెలలుగా బోర్డుకు లెక్చరర్లు, సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులతో ఇంటర్‌ విద్యామండలిలో నిధుల గోల్‌మాల్‌ వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News