Road Accident: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి

Korukonda: తూ.గో.జిల్లా కోరుకొండలో ఘోర ప్రమాదం

Update: 2023-08-06 09:28 GMT

Road Accident: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి

Korukonda: ఫ్రెండ్‌షిప్‌ రోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఘోర ప్రమాదం జరిగింది. బూరుగుపూడి వద్ద అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కాల్వలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో క్రేన్‌ ద్వారా కారును బయటకు తీశారు. మృతులు ఉదయ్‌కిరణ్‌, హర్షవర్థన్‌, హేమంత్‌గా గుర్తించారు. ఒకరి మృతదేహ‍ం వెలికితీశారు. మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి ఏలూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News