రోడ్లు, భవనాల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మత్తులపై చర్చ.

Update: 2022-02-15 04:09 GMT

రోడ్లు, భవనాల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: రోడ్లు, భవనాల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి అధికారులతో ఆయన చర్చించారు. ఇప్పటివరకు 83 శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నెలాఖరు నాటికి 100 శాతం టెండర్లు పూర్తవుతాయని ముఖ్యమంత్రికి తెలిపారు. మే చివరి నాటికి దాదాపుగా రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులు పూర్తిచేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదన్న సీఎం జగన్.. ఆ తర్వాత వర్షాలు బాగాపడటంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయన్నారు. తమ ప్రభుత్వంలో రోడ్లన్నీ పాడైపోయినట్టు చిత్రీకరించి, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు 2వేల 205 కోట్లు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదని, ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత డబ్బు ఇవ్వలేదు, ఖర్చు చేయలేదని అన్నారు సీఎం జగన్.

Tags:    

Similar News