Chakrapani Reddy: శ్రీశైలం పరిధిలోని షాపుల వేలం పాట ద్వారా దేవస్థానానికి కోట్లలో ఆదాయం
* దేవస్థానానికి ఊహించని రీతిలో సంవత్సరానికి 2 కోట్ల 38 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు పాలకమండలి చైర్మన్ వెల్లడించారు.
Srisailam: శ్రీశైలం ఆలయం పరిధిలోని మల్లన్న షాపుల వేలం పాట ఉత్కంఠ భరితంగా పోటాపోటీగా సాగింది. దీంతో శ్రీశైలం దేవస్థానానికి బహిరంగ వేలం పాట ద్వారా కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ఎన్నడూ లేని విధంగా వేలం పాట పోటాపోటీగా పాడి దేవస్థానం షాపులను వేలం దారులు దక్కించుకున్నారు. దేవస్థానం పరిధిలోని 39 షాపులకు అధికారులు వేలం పాట నిర్వహించగా సంవత్సరానికి కోటి నాలుగు లక్షల రూపాయల అంచనాలతో రేట్లు నిర్ణయించారు.
ఉత్కంఠ భరితంగా సాగిన వేలం పాట దేవస్థానానికి ఊహించని రీతిలో సంవత్సరానికి 2 కోట్ల 38 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు పాలకమండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి వెల్లడించారు. లక్షల రూపాయలతో వేలం పాట పాడి షాపులు దక్కించుకున్నారు. దేవస్థానానికి చెందిన 36 షాపులకు అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించారు. సుమారు 300 మంది వేలం పాటలో పాల్గొని షాపులు దక్కించుకున్నారని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. వేలం పాట వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. దేవస్థానం నిర్వహించిన వేలం పాటలో ఎన్నడూ లేని విధంగా వేలం పాట ద్వారా దేవస్థానానికి కోట్లలో ఆదాయం వచ్చినట్లు పాలకమండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు.