Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు ప్రారంభమైయ్యాయి. బోట్లు ఢీకొన్న ప్రాంతంలో అధికారులు మరమ్మతులు చేస్తున్నారు.

Update: 2024-09-05 07:01 GMT

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు ప్రారంభమైయ్యాయి. బోట్లు ఢీకొన్న ప్రాంతంలో అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. బోట్లు ఢీకొనడంతో కౌంటర్ వెయిట్‌‌ డ్యామేజ్ అయింది. 69వ గేట్‌ను బోట్లు ఢికొట్టాయి. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గడంతో మరమ్మతులు పనులు ప్రారంభించారు. ఇటీవల ప్రకాశం బ్యారేజికి చేరిన వరద ఉద్ధృతికి నాలుగు బోట్లు వచ్చి అడ్డుతగిలిన విషయం తెలిసిందే. దానిలో ఒకటి కౌంటర్‌ వెయిట్‌ను ఢీకొనడంతో విరిగిపోయింది.

67, 68, 69 గేట్లకు రెండు బోట్లు అడ్డుగా ఉండటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా లేదు. బ్యారేజీలో ఇరుక్కున్న పడవలను బెకెమ్ ఇన్‌ఫ్రా సంస్థ సిబ్బంది తొలగిస్తోంది. తొలుత 67, 69 గేట్లు మూసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనులు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags:    

Similar News