సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు అరెస్ట్ నిలిపివేయాలని ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు, ప్రతివాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల పాటు ఏ చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల18కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.
అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రక్షణ పరికరాల కొనుగోళ్లలో తన అరెస్ట్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ముందస్తు మంజూరు చేయాలని కోరుతూ ఏబీ రెండు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే కోర్టుకు సెలవులున్న రోజుల్లో తనను అరెస్ట్ చేసి 2 రోజులపాటు కస్టడీలో ఉంచిన తర్వాత అదే కారణం చూపి తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కె.లలిత అరెస్ట్ పై రెండు వారాల పాటు స్టే ఇచ్చారు.