చిత్తూరు పోలీసుల డేరింగ్ అండ్ డేషింగ్ ఆపరేషన్.. చెన్నైలో భారీ ఎర్ర చందనం డంప్ స్వాధీనం

Red Sanders: చెన్నై నగరంలో భారీ ఎర్రచందనం డంప్ ను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2021-08-02 10:53 GMT

చెన్నైలో భారీ ఎర్ర చందనం డంప్ స్వాధీనం

Red Sanders: చెన్నై నగరంలో భారీ ఎర్రచందనం డంప్ ను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలతో పాటు 5 కోట్ల రూపాయల విలువ గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని నలుగురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా వేసిన స్కెచ్ తో చెన్నై నగరం ఆవిడి ప్రాంతంలోని భారీ ఎర్రచందనం డంప్ ను గుర్తించారు. పీలేరు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరకొండ గ్రామం వద్ద వాహనాల తనిఖీలో పట్టుబడ్డ అనుమానితుడి సమాచారం మేరకు చెన్నైలో ఈ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. 

ఆవిడి ప్రాంతంలోని కన్నన్ ఫార్మ్ హౌస్ గోడౌన్ లో దాచిన 11 టన్నుల బరువు గల 388 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు రెండు కార్లు ఒక కంటైనర్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఎస్ బి ఐ జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్ నాయుడు అభినందించారు.

Tags:    

Similar News