Andhra Pradesh: ఏపీలో రేషన్ స్టాక్ దిగుమతి బంద్

* వచ్చే నెల స్టాక్‌ను దిగుమతి చేసుకోకూడదని నిర్ణయం -వెంకట్రావు

Update: 2021-10-26 02:43 GMT

ఏపీలో రేషన్ స్టాక్ దిగుమతి బంద్(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: రేషన్‌ షాపులకు బంద్‌కు పిలునిచ్చిన రేషన్‌ డీలర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు రేషన్ దిగుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద మాత్రం ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు వచ్చే నెల స్టాక్‌ను దిగుమతి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు.

ముందుగా పంపిణీ కూడా నిలిపివేస్తామని ప్రకటించినా ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు వెంటనే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేస్తుంది. గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే ప్రతీ సంచికి రూ.20 ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు నగదు ఇవ్వమని చెప్పడం సరికాదన్నారు డీలర్లు. గోనె సంచులు తిరిగి ఇవ్వకపోతే కేసులు పెడతామని హెచ్చరించడం తగదన్నారు.

గోనె సంచులను ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10ని తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారని డీలర్లు గుర్తుచేశారు. ఏపీలోనూ జీవో 10ని యథాతథంగా అమలు చేయాలని రేషన్‌ డీలర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కమిషన్‌ బకాయిలు 2020 నుంచి చెల్లించడం లేదని రేషన్‌ డీలర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వచ్చేనెల రేషన్‌ సరుకులు దిగుమతి చేసుకోకూడదని తీర్మానం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే బంద్‌ కు దిగుతామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News