పరిటాల కుటుంబంలో విషాదం..

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత కుటుంబంలో విషాదం నెలకొంది.

Update: 2019-12-22 07:38 GMT

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత పరిటాల రవి చిన్నాన్న(సునీతకు చిన్న మామ) టీడీపీ నాయకుడు పరిటాల గజ్జిలప్ప మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గజ్జిలప్ప ఇకలేరని తెలుసుకున్న జిల్లాకు చెందిన నేతలు, టీడీపీ ముఖ్యనేతలు సంతాపం తెలిపారు.

కాగా.. సోమవారం మధ్యాహ్నం పరిటాల గజ్జిలప్ప అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన గజ్జిలప్ప అన్న శ్రీరాములు కొడుకు రవికి చేదోడువాదోడుగా ఉన్నారు. కనగానిపల్లె , పెనుగొండ మండలాల్లో ఆయనకు మంచి ఉంది. ఆయన మృతికి పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారథి, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి తదితర టీడీపీ నేతలు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 

Tags:    

Similar News