AP Politics: ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు.. ముందస్తు ఎన్నికల సంకేతాలతో..
AP Politics: గతంలో కంటే ఎక్కువ సభలకు హాజరవుతున్న సీఎం జగన్
AP Politics: ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల సంకేతాలతో.. పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచాయి. గతంలో కంటే ఎక్కువ సభలకు సీఎం జగన్ హాజరవుతున్నారు. వారాహితో పవన్ జనంలోకి రాగా.. పాదయాత్రతో లోకేష్, సూపర్‌సిక్స్ హామీలతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో పొత్తుల అంశం కీలకంగా మారుతుంది. ఈ నెలాఖరు లోపు పొత్తుల ప్రక్రియ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగానే.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల అంశం ఆసక్తి రేపుతుంది.
టీడీపీతో పొత్తుకు రాష్ట్ర బీజేపీ ససేమిరా అంటున్నా.. జనసేనతో పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. ఇటీవల టీడీపీ, జనసేనలతో కలిసి.. ఎన్నికలకు వెళ్తానని కేంద్రమంత్రి నారాయణ స్వామీ ప్రకటించారు. అయితే పొత్తుల అంశం హైకమాండ్ చూసుకుంటుందని.. ఎవరూ ఎలాంటి ప్రకటన చేయొద్దని పురంధేశ్వరి ప్రకటించారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నేడు హస్తినకు వెళ్లనున్నారు. రేపటి NDA సమావేశంలో పవన్, నాదెండ్ల పాల్గొననున్నారు. పొత్తుల అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామాలన్నీంటినీ అధికార వైసీపీ నిశితంగా పరిశీలిస్తుంది.