రామతీర్థంలో కొనసాగుతున్న హై టెన్షన్‌

* చలో రామతీర్థంకు హైందవ సంఘాల ఐక్యవేదిక పిలుపు * తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న హైందవ సంఘాల ప్రతినిధులు * కాసేపట్లో రామతీర్థం సందర్శించనున్న మంత్రులు బొత్స, వెల్లంపల్లి

Update: 2021-01-03 05:42 GMT

విజయనగరం జిల్లా రామతీర్థంలో హై టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. చలో రామతీర్థంకు హైందవ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైందవ సంఘాల ప్రతినిధులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు మంత్రులు బొత్స, వెల్లంపల్లి రామతీర్థం సందర్శించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు రామతీర్థంలో గత ఆరు రోజులుగా నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరాన్ని రాత్రికి రాత్రి తొలగించిన పోలీసులు.. పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ఓ వైపు హైందవ సంఘాల చలో రామతీర్థం, మరోవైపు మంత్రుల పర్యటనతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు రామతీర్థానికి రామ, హనుమాన్‌ భక్తులు కూడా భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక హై టెన్షన్‌ నెలకొంది.

Full View


Tags:    

Similar News