Rajini: గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థిగా రజిని నామినేషన్
Rajini: గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు
Rajini: గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడదల రజిని నామినేషన్ వేశారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య, ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రజలకు సీఎం జగన్ మేలు చేశారన్నారు. జగన్ రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు.