Andhra Pradesh: కాసేపట్లో ఏపీలోకి రాహుల్ భారత్ జోడోయాత్ర
Andhra Pradesh: కర్ణాటకలోని రాంపురం నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర
Andhra Pradesh: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. కర్ణాటకలోని రాంపురం గ్రామం నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. అనంతపురం జిల్లా డి హీరేహళ్ వద్ద ఉన్న మారెమ్మ దేవాలయం వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. మారెమ్మ దేవాలయం వద్ద విశ్రాంతి తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభమై ఓబులాపురం చెక్ పోస్ట్ మీదుగా కర్ణాటకలోని బళ్లారి నగరంలోకి చేరుకుంటుంది. రాత్రికి రాహుల్ గాంధీ బళ్లారిలో బస చేయనున్నారు.