RaghuRama Krishna Raju: ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామకృష్ణరాజు
RaghuRama Krishna Raju: సుప్రీం కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ రఘురామకృష్ణమ రాజు ఆర్మీ ఆసుపత్రిలో నే వుండనున్నారు.
RaghuRama Krishna Raju: నర్సాపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు కు సికింద్రాబాద్ ఆర్మటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. మెడికల్ బోర్డు చెప్పిందే ఆర్మీ ఆసుప్రతి చెబుతుందా? లేక రఘురామకృష్ణ రాజు వాదనలను సమర్థిస్తుందా? లేక అటు పోలీసులు, ఇటు రఘురామ ఇద్దరి వాదనలు కరెక్టు కాదంటుందా? అంతా ఆ సీల్డ్ కవర్ లోనే వుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణం రాజుకు ముగ్గురు వైద్యుల మెడికల్ బోర్డ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించింది. వైద్య పరీక్షలను అధికారులు వీడియో తీయించి సీల్ట్ కవర్ లో భద్రపరిచారు. వైద్యాధికారుల నివేదికను జ్యుడీషియల్ రిజిస్ట్రార్ హైకోర్టుకు అందజేశారు.
డాక్టర్ల నివేదికతో పాటు వీడియో ఫుటేజీని సీల్డ్ కవర్ లో సుప్రీంకు మంగళవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు పంపింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామకృష్ణంరాజు ఉండనున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఎంపీ రఘురామకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ఆయన ఆర్మీ ఆసుపత్రిలోనే ఉంటారని అధికారులు తెలిపారు.
కాగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి సోమవారం రాత్రి రోడ్డు మార్గాన తరలించిన విషయం తెలిసిందే. ఎంపిని కలిసేందుకు ఆయన తనయుడు భరత్ మధ్యాహ్నం సైనికాసుపత్రికి రాగా ఆయనను సైనికాధికారులు లోపలికి అనుమతించలేదు. మీడియా సిబ్బందిని కూడా ఆసుపత్రికి 500 మీటర్ల దూరంలోనే నిలిపివేశారు. అయితే వైద్య పరీక్షల నిర్వహణ నుంచి నివేదిక పంపడం వరకూ రహస్యంగానే కొనసాగింది. సుప్రీం కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ జ్యుడీషియల్ కష్టడిలో ఉన్న రఘురామకృష్ణమ రాజుకు ఇక్కడే చికిత్స అందిస్తామని సికింద్రాబాద్ సైనికాసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.