RRR Case: సికింద్రాబాద్‌కు రఘురామ తరలింపు
RRR Case: గుంటూరు జైలు వద్దకు పోలీసులు చేరుకొని ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు.
RRR Case: నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు నుంచి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గుంటూరు జైలు వద్దకు పోలీసులు చేరుకొని ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు. గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌కు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ దగ్గర ఉండి పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
రఘురామకృష్ణరాజు తరుపు న్యాయవాదులు గుంటూరులోని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలు నుంచి రఘురామను రమేష్ ఆస్పత్రికి పంపాలన్న కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలను సీఐడీ అధికారులు పాటించడం లేదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రఘురామ తరుపు న్యాయవాది లక్ష్మినారాయణ కోర్టుకు విన్నవించారు.
రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రఘురామ వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామను తరలించాలని సూచించింది. ఆర్మీ ఆస్పత్రిలో మెడికల్ పరీక్షలకు అనుమతిచ్చిన సుప్రీం.. పరీక్షల సమయంలో వై కేటగిరి భద్రత ఉండాలని ఆదేశించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ తీయాలని, నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేయాలని సూచించింది.